Tue Nov 26 2024 04:06:27 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మా.. కుక్కలు చంపేస్తున్నాయమ్మా ! పాపం పసిప్రాణం..
గ్రామానికి చెందిన రాంబాబు- రామలక్ష్మిల కుమార్తె సాత్విక (18 నెలలు). స్థానికంగా ఆ దంపతులు టిఫిన్ సెంటర్ ను నడుపుతున్నారు.
పాపం.. పసిప్రాణం.. ఆకలేస్తే ఏడవడం, నిద్రొస్తే పడుకోవడం, ఆడుకోవడం తప్ప మరేమీ తెలియని వయసు. ఏదైనా నొప్పికలిగినా వచ్చీ రాని మాటలతో సరిగ్గా చెప్పుకోలేని 18 నెలల పసిపాప. అమ్మఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారి.. కుక్కకాటుతో మృత్యు ఒడికి చేరింది. రోడ్లపై కుక్కల రూపంలో యమదూతల్లా తిరుగుతున్న కుక్కలు.. 18 నెలల చిన్నారిని గొంతుపట్టి ఈడ్చుకెళ్లి మరీ చంపేశాయి. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రాంబాబు- రామలక్ష్మిల కుమార్తె సాత్విక (18 నెలలు). స్థానికంగా ఆ దంపతులు టిఫిన్ సెంటర్ ను నడుపుతున్నారు. నిద్రపోతున్న చిన్నారిని తల్లి అలానే ఉంచి పని చేసుకునేందుకు పక్కకు రావడంతోనే ఊహించని దారుణం జరిగిపోయింది. చెల్లిని చూసుకోమ్మా అని మూడేళ్ల పెద్దకూతురు కుసుమకు చెప్పి రామలక్ష్మి వంటపాత్రలను కడిగేందుకు వెళ్లింది. ఇంతలో ఓ కుక్క ఆ టిఫిన్ సెంటర్లోకి చొరబడి నిద్రపోతున్న చిన్నారి సాత్వికను సమీపంలోని తోటలోకి ఈడ్చుకెళ్లింది. కాసేపటికి వచ్చిన తల్లికి కుసుమ జరిగింది చెప్పింది.
స్థానికులంతా కలిసి పరుగు పరుగున తోటలోకి వెళ్లి చూడగా.. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. బిడ్డ ఒంటిపై కుక్కకాట్లు, రక్తపు మరకలు చూసిన ఆ తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు. అప్పటివరకూ బోసినవ్వులతో కళ్లముందు కదలాడిన చిన్నారి.. మృత్యు ఒడిలోకి చేరింది. 18 నెలలకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. నేడు ఆ చిన్నారికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story