Fri Dec 27 2024 11:04:47 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ హాస్టల్లో యువతిపై హత్యాచారం
అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం రాత్రి 11.30 గంటల
ముంబైలో 18 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. చర్ని రోడ్డులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిందని పోలీసులకు సమాచారం అందింది. తీరా ఆ యువతిని ఆమె రూమ్ లోనే హత్య చేసి బయట తాళం వేసి వెళ్లిపోయారని గుర్తించారు. ఆమెపై హత్యాచారం చేసిన వ్యక్తి కూడా చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. దక్షిణ ముంబైలోని తన హాస్టల్ గదిలో యువతి హత్యకు గురైంది. బాలికల ప్రభుత్వ హాస్టల్ నాలుగో అంతస్తులో ఉన్న తన గదిలో ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. అనుమానితుడు, లాండ్రీ మ్యాన్‌గా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ప్రకాష్ కనోజియా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై అతని మృతదేహం లభ్యమైంది.
నాలుగో అంతస్తులో ఒక్కతే ఉన్న బాలిక మంగళవారం తెల్లవారుజామున హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కనోజియా (35) తెల్లవారుజామున 4.55 గంటలకు మెయిన్ గేట్ సెక్యూరిటీ క్యాబిన్ దగ్గర బట్టల మూటను వదిలి బయటకు వెళుతుండగా హాస్టల్ సీసీటీవీ కెమెరాలో చిక్కాడు. బాలికకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ అధికారులు మంగళవారం సాయంత్రం వెతకగా ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కిటికీలోంచి గదిలోకి చూడగా, రెండు మంచాల మధ్య నేలపై ఆమె శరీరం నగ్నంగా పడి ఉంది. గది బయటి నుంచి తాళం వేసి ఉంది. అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు హాస్టల్ మేట్ ఆమెతో చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
Next Story