Mon Dec 23 2024 04:10:21 GMT+0000 (Coordinated Universal Time)
ముంబైలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
బాధిత యువతి కొంతమంది క్యాటరర్లతో పనిచేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రధాన నిందితుడు ఆమెతో సంభాషణ కలిపాడు. తమ వద్ద పని
దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని అయిన ముంబైలో మరో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. స్థానిక గోవండి ప్రాంతంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. శనివారం ఉదయం 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతి కొంతమంది క్యాటరర్లతో పనిచేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రధాన నిందితుడు ఆమెతో సంభాషణ కలిపాడు. తమ వద్ద పని ఉందని, దాని గురించి తన స్నేహితులు మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి నమ్మించాడు.
Also Read : ఇన్ స్టాలో పరిచయం, ప్రేమ.. హెటల్లో అత్యాచారం
మురికివాడలోని ఓ గడ్డివాము వద్దకు యువతిని తీసుకెళ్లి.. పథకం ప్రకారం ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత అతడి స్నేహితులు సైతం ఆమెపై అత్యాచారం చేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని తెలియజేయగా.. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), ఇతర సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం వజ్రేశ్వరి, ముంబ్రా, వాషి, బేలాపూర్, వడాలా, సీఎస్ఎమ్టీ, ఎల్టీ మార్గ్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ల వద్ద 10 పోలీసు బృందాలతో నిఘా పెట్టగా.. ముగ్గురు మైనర్లు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story