Mon Apr 07 2025 14:41:53 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలల గర్భిణి ఆత్మహత్య
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రావణి (21)కి..

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో వెదుళ్లపాలెం గ్రామానికి చెందిన రెండునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రావణి (21)కి, పెనుగొల్లుకు చెందిన శివతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రావణి 2 నెలల గర్భిణిగా ఉంది. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్న శ్రావణి చికిత్స తీసుకున్నా తగ్గలేదు.
మంగళవారం రాత్రి కడుపునొప్పి తీవ్రంగా రావడంతో తన గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి వెంటనే శ్రావణిని కిందికి దించి ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూసింది. కడుపునొప్పి తాళలేకే కుమార్తె బలవన్మరణం చెందినట్లు శ్రావణి తల్లి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story