Tue Dec 24 2024 00:54:16 GMT+0000 (Coordinated Universal Time)
కూల్ డ్రింక్ అనుకుని టిన్నర్ తాగి చిన్నారి మృతి
ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా.. ఏర్పాట్లలో కుటుంబసభ్యులు బిజీగా ఉన్నారు. పెళ్లివేడుక నేపథ్యంలో ఇంట్లో తలుపులకు రంగులు..
వేసవి తాపం తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే.. వాళ్లను ఊరుకోబెట్టేందుకు చల్లటి పానీయాలను అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు అవి లేకపోతే ముద్ద కూడా ముట్టట్లేదు పిల్లలు. అలా ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని టిన్నర్ తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఏమరపాటుతనం ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది.
ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా.. ఏర్పాట్లలో కుటుంబసభ్యులు బిజీగా ఉన్నారు. పెళ్లివేడుక నేపథ్యంలో ఇంట్లో తలుపులకు రంగులు వేస్తుండగా.. సౌమ్య (2) అనే చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని టిన్నర్ తాగేసింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. పెళ్లి వేడుకతో.. బంధువర్గంతో కళకళలాడాల్సిన ఇల్లు.. చిన్నారి మృతితో విషాదంతో నిండింది. సౌమ్య మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Next Story