Tue Nov 05 2024 14:54:53 GMT+0000 (Coordinated Universal Time)
కల్తీ మద్యం కలకలం.. 20 మంది మృతి
కొందరు వ్యక్తులు ట్యాంకర్లో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు విక్రయించగా.. దానిని తాగిన కొందరు మరణించారని..
ఆ రాష్ట్రంలో ఏడేళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ తరచూ ప్రజలు కల్తీ మద్యం తాగి మృత్యువాత పడుతున్నారు. ఈ ఘటనలు బీహార్ లో కలకలం రేపుతున్నాయి. తాజాగా తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహరి ప్రాంతంలో కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ట్యాంకర్లో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు విక్రయించగా.. దానిని తాగిన కొందరు మరణించారని తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంతవరకూ పోలీసులు స్పందించలేదని సమాచారం. ఈ ఘటనపై స్పందించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. కల్తీమద్యం తాగి 20 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక అధికారుల నుంచి వివరణ కోరినట్లు ఆయన తెలిపారు.
Next Story