Fri Dec 20 2024 22:41:10 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో మరో దారుణం.. పోలీసునని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి..
జులై 7న ఓ కళాశాల విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కారులో వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి వారిని ఫాలో అయ్యాడు.
దేశ రాజధానిలో వరుస దారుణాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు ఓ ఫ్లై ఓవర్ కింద లభ్యమవ్వడం కలకలం రేపగా.. నేడు ఓ యువతిపై ఒక వ్యక్తి తాను పోలీసంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. యువతి తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలు చూపించి ఆమె పై అత్యాచారం చేశాడు. గతవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జులై 7న ఓ కళాశాల విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కారులో వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి వారిని ఫాలో అయ్యాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. బాయ్ ఫ్రెండ్ ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లగానే నిందితుడు ఆమె వద్దకు వెళ్లి.. తాను పోలీసునని చెప్పి.. అతను తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి బెదిరించాడు. తనకు సహకరించకపోతే వాటిని ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆపై అపార్ట్ మెంట్ బయటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Next Story