Mon Dec 23 2024 12:29:06 GMT+0000 (Coordinated Universal Time)
కదులుతున్న రైలులో యువతిపై లైంగిక దాడి
అందుకోసం సీఎస్ఎంటీ వద్ద హర్బర్ లైన్ లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ రైలు కదిలిన వెంటనే లేడీస్ కంపార్ట్ మెంట్ లో..
కదులుతున్న లోకల్ ట్రైన్ లో 20 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిర్ గౌన్ ప్రాంతానికి చెందిన మహిళ నవీ ముంబైలో పరీక్ష రాసేందుకు వెళ్లాలి. అందుకోసం సీఎస్ఎంటీ వద్ద హర్బర్ లైన్ లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ రైలు కదిలిన వెంటనే లేడీస్ కంపార్ట్ మెంట్ లో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. ఆ కంపార్ట్ మెంట్ లో యువతి తప్ప మరో మహిళ లేదు. రైలు వెళ్తుండగానే ఆ వ్యక్తి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
దాంతో యువతి బిగ్గరగా అరుస్తూ.. దూరంగా పరుగెత్తింది. ఇంతలో స్టేషన్ రావడంతో సదరు వ్యక్తి మస్ జీద్ స్టేషన్ వద్ద దిగిపోయాడు. అనంతరం ఆమె రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన జీఆర్పీ, ఆర్పీఎఫ్, ముంబై పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మస్జీద్ స్టేషన్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతడిపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రోజువారీ కూలీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
Next Story