Mon Dec 23 2024 10:12:34 GMT+0000 (Coordinated Universal Time)
నిర్భయ తరహా ఘటన.. కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం
బాధితురాలు సోమవారం (మే8) కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ప్రధాన..
త్రిపురలో నిర్భయ తరహా ఘటన జరిగింది. 20 ఏళ్ల యువతి కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. కారు కదులుతుండగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం బాధిత యువతిని ఓ ప్రాంతంలో వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు సోమవారం (మే8) కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి బాధితురాలికి 5 నెలలుగా తెలుసు. యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం.. కారును ఎక్కడ ఆపకుండా నగరమంతా తిప్పుతూ అత్యాచారం చేశారు. అర్థరాత్రి తర్వాత బాధితురాలిని ఆమె ఇంటికి సమీపంలోని స్కూల్ గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారం చేశారు. అనంతరం పరారయ్యారు.
నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం బాధిత యువతి జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గైత్ శర్మ (26), సుదీప్ ఛెత్రి (31), పెద్దజిత్ పాల్ (26)గా గుర్తించారు. ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story