Mon Dec 23 2024 12:40:45 GMT+0000 (Coordinated Universal Time)
చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య
పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా..బిదిషా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం..
హైదరాబాద్ : చిత్రసీమలో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ (21)ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం కోల్ కతాలోని తన నివాసంలో బిదిషా డి మజుందార్ విగతజీవిగా కనిపించింది. తన చావుకు కారణాలు తెలుపుతూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది. బిదిషా నాలుగేళ్లుగా అదే అపార్ట్ మెంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
మే 25న బిదిషా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా..బిదిషా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిదిషా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించిందని, కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిదిషా 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో 'భార్- ది క్లౌన్' షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. బిదిషా రాసిన సూసైడ్ నోట్ లో ఏముందనేది తెలియాల్సి ఉంది.
కాగా.. ఇటీవలే బెంగాలీ నటి పల్లవి డే చనిపోయిన విషయం మరిచిపోకముందే.. మరో నటి ఆత్మహత్యకు పాల్పడటంతో బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story