Mon Dec 23 2024 22:57:10 GMT+0000 (Coordinated Universal Time)
కాలువలోకి దూసుకెళ్లిన మినీ వ్యాను.. 22 మంది మృతి
హైవేపై వెళ్తున్న మినీ వ్యాను నీటిపారుదల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి మరణించగా..
ఈజిప్ట్ లోని ఉత్తర డకాలియా ప్రావిన్స్ పరిధిలోని ఆగ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న మినీ వ్యాను నీటిపారుదల కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. డ్రైవర్ డ్రగ్స్ మత్తులో డ్రైవింగ్ చేయడమే కారణమని పోలీసులు నిర్థారించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. చికిత్స పొందుతున్న పలువురు డ్రైవర్ మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వ్యాన్ నడుపుతుండగా.. మరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.
అగా పట్టణంలోని అల్ రయా అల్ తౌఫి కాలువలోకి మినీ వ్యాన్ దూసుకెళ్లినట్టు వెల్లడించారు. మినీ బస్సు కాలువలోకి దూసుకెళ్లేముందు అందులో నుంచి ఒకరిద్దరు బయటకు దూకారు. దీంతో వారి కాళ్లు, భుజాలకి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి 18 అంబులెన్సుల్లో ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ పౌండ్లను, క్షతగాత్రులకు 25వేల పౌండ్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story