Fri Dec 27 2024 11:51:58 GMT+0000 (Coordinated Universal Time)
స్నేక్ స్మగ్లింగ్.. మహిళ బ్యాగులో పాముల కుప్ప
శుక్రవారం చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి అధికారులంతా షాకయ్యారు. మలేషియా నుంచి వచ్చిన ఓ మహిళ బ్యాగును
ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రతి ప్రయాణికుడిని, ప్రయాణికురాలను, వారి లగేజీలను ఎయిర్ పోర్టు సిబ్బంది తదేకంగా చెక్ చేసిన తర్వాతే బయటికి పంపుతారు. ఒక్కోసారి విదేశాల నుండి వచ్చిన ప్రయాణికుల వద్ద డ్రగ్స్, బంగారం పట్టుబడతాయి. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. లగేజీల్లోనే కాకుండా శరీరంలోనూ డ్రగ్స్ ను పెట్టుకుని వచ్చిన వారు కోకొల్లలు. కానీ.. ఈ మహిళ వాళ్లందరినీ మించిపోయింది. ఏకంగా పాములనే స్మగ్లింగ్ చేసేస్తోంది.
శుక్రవారం చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి అధికారులంతా షాకయ్యారు. మలేషియా నుంచి వచ్చిన ఓ మహిళ బ్యాగును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. కుప్పలుగా పాములు, ఒక ఊసరవెల్లి బయటపడ్డాయి. నిందితురాలి లగేజీలో ఏకంగా 22 పాములు, ఓ ఊసరవెల్లి ఉన్నట్టు గుర్తించారు. లగేజీలో నుంచి ఒక్కసారిగా బయటపడిన ఆ పాముల్ని సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు. వాటన్నింటినీ సదరు మహిళ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి తెచ్చింది. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆమెపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story