Sun Mar 23 2025 00:49:10 GMT+0000 (Coordinated Universal Time)
27 సంవత్సరాల యువతి మర్డర్ ను 12 గంటల్లో చేధించిన పోలీసులు.. చంపింది ఎవరంటే..?
27 సంవత్సరాల యువతి మర్డర్ ను 12 గంటల్లో చేధించిన పోలీసులు.

27 సంవత్సరాల యువతి హత్యను పోలీసులు 12 గంటల్లో చేధించారు. 27 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు అంతమొందించాడు. ఆమెకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు అఖిలేష్ ప్యారేలాల్ గౌతమ్ (24)ని సబర్బన్ మన్‌ఖుర్డ్‌లో మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గౌతమ్ హత్యకు గురైన మనీషా జైస్వర్ (27) తో అనుబంధం కలిగి ఉన్నాడు. వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
అయితే మనీషా మీద గౌతమ్ అనుమానం పెంచుకున్నాడు. గౌతమ్ తన ప్రియురాలికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వేధించడం మొదలు పెట్టాడు. గురువారం తెల్లవారుజామున కందివలి శివారులోని ఆమె నివాసానికి వెళ్లి వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ పెద్దదై ఆమె గొంతు కోశాడు. మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. ఇక ఆమె తలపై కూడా రెండు పెద్ద గాయాలు ఉన్నాయని.. హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. కేసును విచారించేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి.. మృతుడిని వెతికేపనిని ప్రారంభించారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించిన వివరాలు సేకరించిన తర్వాత, పోలీసులు అతన్ని ట్రేస్ చేశారు. పోలీసుల విచారణలో.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
News Summary - 27-year-old woman killed by lover in mumbai Kandivli
Next Story