Mon Dec 23 2024 08:36:05 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న రైలు
సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్ల తెంపుకున్నారు. అనంతరం రైల్వే..
వేగంగా దూసుకొచ్చిన రైలు ముగ్గురు చిన్నారులను బలితీసుకుంది. ఈ ఘోర దుర్ఘటన పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో జరిగింది. నలుగురు చిన్నారులు రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటుండగా వేగంగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్ల తెంపుకున్నారు. అనంతరం రైల్వే పట్టాలపై కూర్చుకుని వాటిని తింటున్నారు. అదే సమయంలో సహరాన్పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండానే ఆ చిన్నారులు పండ్లను తినడంలో లీనమయ్యారు. ఇంతలో ఊహించని విషాదం జరిగింది. రైలు వారిని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్రగాయాలైన చిన్నారులను ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలో ఒకరు మృతి చెందారు. మరొక చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల మరణాలతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Next Story