Mon Dec 23 2024 06:58:02 GMT+0000 (Coordinated Universal Time)
శివకాశిలో మరోసారి అలాంటి ప్రమాదమే
ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంలో జనసేన ఆ గుర్తును దాదాపు కోల్పోయినట్టే. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..
టపాసులకు ఎంతో ఫేమస్ అయిన తమిళనాడులోని శివకాశిలో మరోసారి పేలుడు చోటు చేసుకుంది. బాణాసంచా కర్మాగారంలో గురువారం జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను ఎస్.కుమరేశన్, ఆర్.సుందరరాజ్, కె.అయ్యమ్మాళ్ గా గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఈ ప్రమాదం శివకాశిలోని ఊరంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. శివకాశి సమీపంలోని బాణాసంచా తయారీ యూనిట్లో గురువారం జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
మృతి చెందిన ఉద్యోగులను మంసాపురంకు చెందిన ఎస్ కుమారేషన్ (33), పల్లపట్టికి చెందిన ఆర్ సుందర్రాజ్ (27), శివకాశి సమీపంలోని రిజర్వ్లైన్కు చెందిన కె అయ్యమ్మాళ్ (70)గా గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కదర్కరై యాజమాన్యంలోని యూనిట్ ఊరంపట్టి గ్రామంలో ఉంది.
పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లైసెన్స్ పొందిన ఈ యూనిట్లో 40కి పైగా వర్కింగ్ షెడ్లు ఉండగా 70 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒక షెడ్లో పటాకుల తయారీకి సంబంధించిన రసాయనాలను ఉద్యోగులు కలుపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి షెడ్డు కూలిపోయింది. శివకాశి అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇతర కూలీలను రక్షించారు. వారిని వెంటనే శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు సాయం అందిస్తామని చెప్పారు.
Next Story