Sat Nov 23 2024 02:13:02 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి జీవిత ఖైదు !
అభం శుభం తెలియని చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కామాంధులను అసలు వదలకూడదని ప్రజలు కోరుతూ ఉన్నారు. 2019లో
దేశంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడానికి ఎన్నో కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఘటనల విషయంలో తీర్పులు కేవలం రోజుల వ్యవధిలో వస్తూ ఉన్నాయి. మరికొన్ని వాటిపై ఇంకా కోర్టుల్లో కేసులు నలుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కామాంధులను అసలు వదలకూడదని ప్రజలు కోరుతూ ఉన్నారు.
2019లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చోటు చేసుకున్న కేసులో రాంచీలోని ప్రత్యేక పోక్సో కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధించింది. ముగ్గురు నిందితులను ఖలీద్ రాజ్, యశ్ రాజ్ సునేజా, బబ్లూగా గుర్తించారు. వీరిని సామూహిక అత్యాచారం కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది. జార్ఖండ్లోని రాంచీలోని మహిళా పోలీస్ స్టేషన్లో 2019లో కేసు నమోదైంది. చైబాసా జిల్లాకు చెందిన బాధితురాలు స్థానికంగా తెలిసిన ఖలీద్ రాజ్ ఇతరులను కలిసింది. తెలిసిన వారే కదా అని బాలిక మాట్లాడింది. కానీ ఆ ముగ్గురూ మైనర్ బాలికను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వచ్చింది. రాంచీలోని ప్రత్యేక పోక్సో కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది.
Next Story