Mon Dec 23 2024 02:38:28 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. నలుగురు వ్యక్తుల పేర్లు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. నలుగురు వ్యక్తుల పేర్లు
లక్నోలోని జానకీపురం ప్రాంతంలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విషం సేవించారు. చికిత్స పొందుతూ తండ్రీకూతురు మృతి చెందగా.. తల్లి ప్రాణాలను కాపాడడానికి వైద్యులు చాలా కష్టపడ్డారు. అయినా వారి కష్టం ఫలించలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ శైలేంద్ర కుమార్ తో పాటూ.. ఆయన భార్య గీత (38), కుమార్తె ప్రాచీ (17)లు కూడా విషం తాగారు. శైలేంద్ర 15 ఏళ్ల కుమారుడు స్పోర్ట్స్ ఈవెంట్ లో హాజరయ్యేందుకు ఇండోర్కు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మరణించిన ఇంజనీర్ గది నుండి పోలీసులు ఒక నోట్ను స్వాధీనం చేసుకున్నారు, అందులో అతను నలుగురు వ్యక్తుల పేర్లను రాశారు. ఈ ఆత్మహత్య నిర్ణయానికి వారే బాధ్యులని చెప్పుకొచ్చారు.
వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న జగన్నాథ్ ప్రసాద్ కు బుధవారం ఉదయం 10.50 గంటలకు శైలేంద్ర నుండి ఫోన్ వచ్చింది. తాను డిప్రెషన్లో ఉన్నానని.. తన జీవితాన్ని ముగిస్తున్నానని కాల్ వచ్చిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ ఉదయం 11 గంటలకు శైలేంద్ర ఇంటికి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. గేటు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. యూపీ పోలీసులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. "ప్రాథమిక విచారణలో శైలేంద్ర మంచం మీద కూర్చున్నాడని, అతని భార్య గది మూలలో ఉందని తేలింది. వారి కుమార్తె ప్రాచీ వాంతులు చేసుకుంటుందని తేలింది. బాధితులను తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, వారు కేసును KGMU యొక్క ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. శైలేంద్ర, ప్రాచీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించగా, గీత మధ్యాహ్నం KGMUలోని ట్రామా సెంటర్లో మరణించింది" అని పోలీసులు తెలిపారు. కిచెన్లో ఐదు పురుగుల మందు సీశాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
కుమార్ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ అని, బారాబంకిలో పోస్టింగ్ పొందాడని నార్త్ జోన్ డీసీపీ ఖాసీం అబ్ది తెలిపారు. రూ. 1 కోటి అతను డబ్బు పెట్టుబడి పెట్టిన భూమి విషయంలో వివాదం తలెత్తడంతో.. అదంతా ఇరుక్కుపోయిందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను రుణం తీసుకున్న వ్యక్తులు తనను వేధిస్తున్నారని, తాను డిప్రెషన్లో ఉన్నానని కుమార్ పేర్కొన్నాడు. అలాగే, అతను ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించడంతో కుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఫోరెన్సిక్ నిపుణులు సూసైడ్ నోట్ లోని చేతిరాతను పరిశీలిస్తున్నారు. నోట్లో పేర్కొన్న ఆరోపణల గురించి విచారిస్తున్నామని.. నోట్లో ప్రస్తావించిన నలుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు.
Next Story