Fri Dec 27 2024 18:03:41 GMT+0000 (Coordinated Universal Time)
30 ఏళ్ల యువతితో 28 ఏళ్ల అబ్బాయి లవ్.. ఆటోలో ఏమి జరిగిందంటే
దీపక్ తన ఒంటి మీద ఉన్న గాయాలను రుజువుగా చూపిస్తూ.. పంచశీల మొదట దాడి చేసిందని కట్టుకథను చెప్పాడు, అయితే ఆటోరిక్షా డ్రైవర్
ముంబై నగరంలో 30 సంవత్సరాల మహిళను ఆటోలోనే హతమార్చాడు ఆమె ప్రియుడు. ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆటోలో వెళ్తున్న సమయంలో వారిద్దరూ గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తన ప్రియురాలి గొంతు కోసి హత్యచేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ హత్య ఉదంతం కలకలం రేపుతోంది. సాకి నాకాకు చెందిన 30 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు కట్టర్‌తో గొంతు కోసి హత్య చేశాడు. సోమవారం సాయంత్రం ఆటోరిక్షాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు పంచశీల జమ్దార్ తన ప్రియుడు దీపక్ భోర్సే (28)తో గత రెండేళ్లుగా రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది. సోమవారం దీపక్ ఘాట్కోపర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. పంచశీల అతన్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్‌కి వచ్చింది. దీపక్ ఉల్హాస్నగర్ నివాసి కాగా, బాధితురాలు చండీవాలిలోని సంఘర్ష్ నగర్లో నివసిస్తోంది. సాకి నాకా వైపు వెళ్లడానికి ఆటో రిక్షా ఎక్కారు.
ఆ జంట తరచూ పలు విషయాలపై గొడవలు పడుతుండేవారని, పంచశీల తల్లిదండ్రులు దీపక్ తో ఆమె సంబంధాన్ని అంగీకరించకలేదని కూడా పోలీసులు తెలిపారు. ఆటో లోపల వారు ఎప్పటిలాగే గొడవకు దిగారు. అయితే దీపక్ తన జేబులో కట్టర్ని తీసి ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో గొడవ మరింత పెద్దది అవ్వడంతో ఆమె మెడపై ఒక్క వేటు వేశాడు. ఆ తర్వాత అతడు ఆటో దిగి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె ఆటో నుంచి దిగి పరిగెత్తడానికి ప్రయత్నించిందని, అయితే, అక్కడే కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీపక్‌పై రక్తపు మరకలు ఉండటం గమనించారు బాటసారులు. వారు వెంటనే కంట్రోల్ రూమ్‌కు డయల్ చేసారు. సాకి నాకా నుండి పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. బాధితురాలిని రాజావాడి ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యమంలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పారిపోతున్న దీపక్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
దీపక్ తన ఒంటి మీద ఉన్న గాయాలను రుజువుగా చూపిస్తూ.. పంచశీల మొదట దాడి చేసిందని కట్టుకథను చెప్పాడు, అయితే ఆటోరిక్షా డ్రైవర్ సాక్షిగా మారాడు. దీపక్ చేసిన దారుణాన్ని వాంగ్మూలంగా ఇచ్చాడు. అసలు జరిగిందేమిటో బయట పెట్టాడు. దీపక్ చర్యల వెనుక ఉన్న ఖచ్చితమైన ఉద్దేశ్యం, ఆమెను కలిసేటప్పుడు కట్టర్‌ను ఎందుకు తీసుకెళ్లాడు అనేదానిని తెలుసుకోవడానికి మరింత విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.
Next Story