Sun Dec 22 2024 20:10:22 GMT+0000 (Coordinated Universal Time)
బెంగాల్ లో భారీగా పేలుడు పదార్థాలు.. 100 మంది అరెస్ట్
బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో అక్రమ బాణసంచా తయారీ యూనిట్లలో వరుస పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సోమ..
పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాణసంచాను నిషేధించినా అక్రమ తయారీ కర్మాగారాలను నడుపుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 100 మందిని అరెస్ట్ చేసినట్లు బెంగాల్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కబ్జాలకు సంబంధించి పోలీసులు 132 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో అక్రమ బాణసంచా తయారీ యూనిట్లలో వరుస పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సోమ, మంగళవారాల్లో బెంగాల్ లోని నడియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో పోలీసుల దాడులు కొనసాగాయి. ఇప్పటివరకూ 34 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, బాణసంచా స్వాధీనం, అరెస్టులపై మే 29 వ తేదీలోగా రాష్ట్ర సచివాలయానికి నివేదిక ివ్వాలని వివిధ జిల్లాల పోలీసులను ఉన్నతాధికారులు కోరారు. బాణసంచా కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో 17 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Next Story