Mon Dec 23 2024 08:18:07 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. 20 నెలల పాపపై అత్యాచారం
ఇంట్లో తల్లిదండ్రులు లేకుండా చూసి.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు..
ఆడపిల్లల రక్షణకై ఎన్నిచట్టాలు తెచ్చినా, ఎంతమందిని శిక్షించినా కామాంధుల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. పసికందుల నుండి వృద్ధ మహిళల వరకూ.. ఆడవాళ్లు బయట ఒంటరిగా కనిపించడమే శాపమవుతోంది. దేశంలో ప్రతిరోజూ ఏదొకమూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజులు, నెలల పిల్లలనూ వదలడం లేదు. ఇలాంటి ఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఓ పక్క ప్రతి రంగంలోనూ ఆడపిల్లలు, మహిళలు ముందంజలో ఉంటుంటే.. మరో పక్క అత్యాచారాలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి.
తాజాగా దేశ ఆర్థిక రాజధానిలో 20 నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. సెంట్రల్ ముంబైలో పసికందు ఇంటికి పొరుగున 35 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేకుండా చూసి.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వారింటికి ఎదురుగా ఉండే 35 ఏళ్ల వ్యక్తి రెండ్రోజుల క్రితం తల్లిదండ్రులు లేని సమయంలో పసిబిడ్డపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు వచ్చిచూసేసరికి చిన్నారి ఏడుస్తూ ఉందని.. ఎదురింటి వ్యక్తి వచ్చినట్లుగా చెప్పిందని చిన్నారి తండ్రి పేర్కొన్నాడు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Next Story