Sat Mar 29 2025 20:55:02 GMT+0000 (Coordinated Universal Time)
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి..16 మందికి గాయాలు
ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్, మాగ్రా పునిలా ఏరియాలో ఉన్న రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకుంది.

రాజస్థాన్ లో దారుణ ఘటన జరిగింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో మరో 16 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని జోధ్ పూర్, మాగ్రా పునిలా ఏరియాలో ఉన్న రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు అక్రమంగా ఎల్పీజీ గ్యాస్ ను ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్ లోకి నింపుతుండగా ఈ పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి నలుగురు సజీవ దహనమవ్వగా.. 16 మంది తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story