Mon Dec 23 2024 15:44:32 GMT+0000 (Coordinated Universal Time)
ఘట్ కేసర్ లో బాలిక కిడ్నాప్ కలకలం.. సైకో సురేష్ ఎక్కడ ?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాప మిస్సైన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సురేష్ అనే వ్యక్తి పాపను..
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటన మరువక ముందే.. ఘట్ కేసర్ లో నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి కిడ్నాప్ స్థానికంగా సంచలనంగా మారింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ఉన్నట్టుండి బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. పాపకోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దాంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాప మిస్సైన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సురేష్ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పాపను ఎత్తుకెళ్లిన వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ సైకో సురేష్ జాడ కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు తమ పాపను క్షేమంగా తీసుకురండి అంటూ తల్లిదండ్రులు పోలీసులను కన్నీటితో వేడుకుంటున్న తీరు స్థానికులను కలచివేస్తోంది. పాపను ఆ సైకో ఏదైనా చేసి ఉంటాడన్న ఊహే భయంకరంగా ఉంటుందంటూ ఆవేదన చెందుతున్నారు. చిన్నారి కృష్ణవేణి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story