Thu Dec 19 2024 14:13:03 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ పై దారుణం.. స్మశాన వాటికలో అత్యాచారం
అదే సమయంలో పాపకు తాత వరుసైన గౌరునాయుడు (48) ఆ బాలిక కోసం మాటు వేశాడు.
మానవ సంబంధాలు రోజురోజుకీ మంటగలిసిపోతున్నాయి. బంధువులైనా.. పరాయి వారైనా సరే.. తమ కామ కోరికలను తీర్చుకునేందుకు ఎంతటికైనా తెగించేందుకు వెనుకాడట్లేదు. తాత, బాబాయ్, మావయ్య, పెదనాన్న ఇలా.. వరుసలు ఏవైనా వాటిని పట్టించుకోకుండా పేట్రేగిపోతున్నారు. తాజాగా.. ఓ మైనర్ ను స్మశానంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం (జనవరి 1) రాత్రి 7 గంటల సమయంలో వీరఘట్టం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బహిర్భూమికి వెళ్లేందుకు బయటికి వచ్చింది. అదే సమయంలో పాపకు తాత వరుసైన గౌరునాయుడు (48) ఆ బాలిక కోసం మాటు వేశాడు. చిన్నారి బయటికి రాగానే.. ఆమె నోరు నొక్కి స్మశానంలోకి ఎత్తుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అటుగా స్థానికులు వస్తుండటం గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు వెళ్లి చూసేసరికి చిన్నారి రక్తస్రావంతో ఏడుస్తూ.. కనిపించింది. వెంటనే చిన్నారిని పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని.. ప్రభుత్వం ఎంత చెప్పినా.. ఇంకా చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టలేదు. ఫలితంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు ఇది కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ఇప్పటికైనా కళ్లుతెరచి.. ప్రభుత్వం కట్టిస్తుందని ఎదురుచూడకుండా.. ప్రతి ఇంటిలోనూ మరుగుదొడ్లు నిర్మించుకోవడం భావితరాలకు మంచిది.
Next Story