Mon Dec 23 2024 02:22:02 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్
వేసవికాలం కావడంతో ఓ కుటుంబం ఇంటి డాబాపై నిద్రించింది. తెల్లవారుజామున నిద్రలేచిన భారతి అనే మహిళ..
కడప : చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. 5 నెలల చిన్నారిని ఆ చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఓ దొంగ ఇంటి వద్ద మాటు వేశాడు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అతను.. మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దాంతో ఆ మహిళ తన చేతిలో ఉన్న 5 నెలల పసికందును వదిలేయడంతో.. ఇంటి మీద నుంచి కిందపడి మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంలో జరిగింది.
వేసవికాలం కావడంతో ఓ కుటుంబం ఇంటి డాబాపై నిద్రించింది. తెల్లవారుజామున నిద్రలేచిన భారతి అనే మహిళ.. బిడ్డను ఎత్తుకుని కిందికి దిగుతున్న సమయంలో.. మాటు వేసిన దొంగ ఆమెలోని బంగారు గొలుసును లాగాడు. దాంతో మహిళ చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. 5 నెలల పసిబిడ్డ మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story