Fri Dec 20 2024 08:02:54 GMT+0000 (Coordinated Universal Time)
నీటిలో మునిగి ఐదుగురు టీనేజర్లు మృతి
బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్ లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం(మే13) మృతి చెందారు. తొలుత నీటిలో దిగిన..
ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు నీటిలోకి దిగి.. మొత్తం ఐదుగురు టీనేజర్లు మృతి చెందారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్ లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం(మే13) మృతి చెందారు. తొలుత నీటిలో దిగిన వారిని కాపాడేందుకు వెనుకే నీటిలోకి దిగిన బాలురు నీటమునిగారు. మొత్తం ఐదుగురు బాలురు నీటమునిగి మరణించారు. మృతులు 16-17 ఏళ్ల వయసు వారేనని స్థానిక పోలీసులు వెల్లడించారు.
కృష్ణసాగర్ లేక్ లో బాలురు ప్రమాదంలో ఉన్నారని సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. సరదాగా ఈత కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగగా వారు మునిగిపోయారు. స్నేహితులను కాపాడేందుకు మరో ముగ్గురు కూడా నీటిలోకి దిగి మరణించారని బోతాద్ ఎస్పీ కిషోర్ బలోలియా పేర్కొన్నారు.
Next Story