Mon Dec 23 2024 04:22:35 GMT+0000 (Coordinated Universal Time)
పురుగులమందు తాగి చిన్నారి మృతి
ఆ బాటిల్ లో ఉన్న ద్రవాన్ని శాన్వి తాగేసింది. కొద్దిసేపటికి వాంతులు చేసుకుంటూ ఇంటికి వెళ్లగా.. పురుగులమందు రావడం..
ముక్కుపచ్చలారని ఓ చిన్నారి కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి కన్నుమూసింది. ఈ ఘటన తెలంగాణలోని కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. భీంపూర్ కు చెందిన రాజేష్ - లావణ్య దంపతులకు ఐదేళ్ల కూతురు శాన్వి ఉంది. ఆ చిన్నారి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. ఇంటి వెనుకనున్న పెద్దనాన్న ఇంటివద్ద ఆడుకుంటున్న శాన్వికి ఓ కూల్ డ్రింక్ బాటిల్ కనిపించింది. కానీ అందులో ఉన్నది కూల్ డ్రింక్ కాదు.
ఆ బాటిల్ లో ఉన్న ద్రవాన్ని శాన్వి తాగేసింది. కొద్దిసేపటికి వాంతులు చేసుకుంటూ ఇంటికి వెళ్లగా.. పురుగులమందు రావడం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కాగజ్ నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. కాగా.. పొలానికి పిచికారి చేయగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింక్ సీసాలో ఉంచారు. దానినే శాన్వి తాగి కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story