Mon Dec 23 2024 08:36:33 GMT+0000 (Coordinated Universal Time)
స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడి మృతి
మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ అపార్ట్ మెంట్ లో..
మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగర శివారు నార్సింగి ఠాణా పరిధిలోని పుప్పాలగూడలో చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ అపార్ట్ మెంట్ లో తన స్నేహితులతో కలిసి మూడవ అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ (5) ప్రమాదవశాత్తు జారి.. అపార్ట్ మెంట్ కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు.
వెంటనే తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా.. దేవాన్ష్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్థారించారు. బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ఇలా హఠాత్తుగా మరణించడంతో ఆ తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Next Story