Mon Dec 23 2024 10:53:00 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. బాలుడిని చంపి కూలర్లో కుక్కేశారు
బాలుడు తప్పిపోయాడనుకున్నతల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో..
మానవత్వానికి మాయని మచ్చల్లా మిగిలిపోయిన ఘటనలెన్నో ఉన్నాయి. ఆ జాబితాలోకి తాజాగా జరిగిన మరో ఘటన చేరింది. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ట్యూషన్ కు వెళ్లిన కొడుకు ఎంతకూ ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా.. ఆ బాలుడు హత్యకు గురైనట్లు తేలింది.
మాచంద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి వివేక్ ప్రభాత్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ట్యూషన్ కు వెళ్లాడు. కానీ అతను ట్యూషన్ కు చేరుకోలేదు. ఇటు ఇంటికీ రాలేదు. బాలుడు తప్పిపోయాడనుకున్నతల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారితో పాటే ట్యూషన్ కి వెళ్లే చిన్నారులను ఆరా తీయగా.. పక్కనే ఉన్న సంతోష్ చౌరాసియా ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. అక్కడ సోదాలు చేయగా.. కనిపించిన దృశ్యం చూసి పోలీసులు షాకయ్యారు. బాలుడిని చంపి మృతదేహాన్ని కూలర్ లో కుక్కారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారా ? సంతోష్ కుటుంబీకులు ఇలా చేశారా ? మరేదైనా కారణం ఉందా ? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Next Story