Thu Dec 19 2024 15:54:46 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారి తేజ మిస్సింగ్ కేసు విషాదాంతం
ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన కనకరాజు, నారాయణమ్మ దంపతుల కుమారుడు తేజ గురువారం రాత్రి 7 గంటల
విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల బాలుడు తేజ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. పెందుర్తిలోని ఎస్ఆర్కే పురంలోని లారీ యార్డులో తేజ అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన కనకరాజు, నారాయణమ్మ దంపతుల కుమారుడు తేజ గురువారం రాత్రి 7 గంటల నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా తేజ ఆచూకీ లభించలేదు. దాంతో.. పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. శుక్రవారం లారీయార్డులో తేజ మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు పంపారు. కాగా.. బాలుడు ప్రమాదంలో మరణించాడా ? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. బాలుడి చేతిపై రెండు చిన్న గాట్లు ఉన్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక బాలుడి మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Next Story