Mon Dec 23 2024 12:09:22 GMT+0000 (Coordinated Universal Time)
ఇనుపగేట్.. మీద పడి బాలిక మృతి
హరిణి శ్రీ తండ్రి శంకర్ ఆ కాంప్లెక్స్ వద్ద వాలెట్ పార్కింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని కిల్పాక్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇనుపగేట్ మీద పడి ఐదేళ్లబాలిక ప్రాణాలు కోల్పోయింది. హార్లేస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది గేటును మూస్తున్న సమయంలో ఒక్కసారిగా అది పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో హరిణి శ్రీ అనే పాప అక్కడే నిలబడి ఉండటంతో.. గేటు పాపపై పడి.. పాప గేటు కింద ఇరుక్కుపోయింది. స్థానికులు గేటును పైకి తీసి.. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు.
హరిణి శ్రీ చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమర్షియల్ కాంప్లెక్స్ మేనేజర్ ను, ఓ సెక్యూరిటీ గార్డ్ ను అరెస్టు చేశారు. హరిణి శ్రీ తండ్రి శంకర్ ఆ కాంప్లెక్స్ వద్ద వాలెట్ పార్కింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తన తండ్రి కోసం తల్లితో కలిసి ఆ కాంప్లెక్స్ వద్దకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. హరిణి గేటు వద్ద ఆడుకుంటుండగా.. అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ సంపత్ గేటును మూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గేటును సరిగ్గా బిగించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Next Story