Mon Dec 23 2024 12:21:38 GMT+0000 (Coordinated Universal Time)
అక్రమ దందా.. రూ.55 లక్షల విలువైన గంజాయి పట్టివేత
అంతర్రాష్ట్ర ముఠా భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. సైబరాబాద్ పోలీసులకు పట్టుబడింది. ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి
మత్తు పదార్థాల అక్రమ దందా విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రాల నుంచి దేశ, విదేశాలకు, విదేశాల నుంచి రాష్ట్రాలకు మత్తు పదార్థాల అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది. స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందా చేయాలని ప్రయత్నించినా.. పోలీసులు చాకచక్యంగా దానిని అడ్డుకుంటున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తుండగా.. లక్షలు, కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. తాజాగా ఓ అంతర్రాష్ట్ర ముఠా భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. సైబరాబాద్ పోలీసులకు పట్టుబడింది. ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : సమంత లైఫ్ లో మ్యాజిక్.. కొత్త ఫొటోలతో పోస్టులు
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.55,03,200 ఉంటుందని అధికారుల అంచనా. మాదాపూర్ పీఎస్ పరిధిలో.. ఒక లారీలో సీక్రెట్ క్యాబిన్ లో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక వాహనం, రూ. 32 వేలు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకుని, వాటిని సీజ్ చేశారు.
Next Story