Mon Dec 23 2024 07:18:49 GMT+0000 (Coordinated Universal Time)
35 ఏళ్ల వ్యక్తితో 55 ఏళ్ల మహిళ స్నేహం.. చివరికి!!
కొన్ని నెలల క్రితం పరిచయమై ఆ తర్వాత దగ్గరైన వ్యక్తి చేతిలో
కొన్ని నెలల క్రితం పరిచయమై ఆ తర్వాత దగ్గరైన వ్యక్తి చేతిలో ఓ మహిళ లైంగికంగా వేధింపులకు గురైంది. తనకు మత్తుమందు ఇచ్చి సదరు వ్యక్తి లైంగికంగా వేధించాడని 55 ఏళ్ల మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని సునీల్ (35)గా గుర్తించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 30న సఫ్దర్‌జంగ్ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్ కు ఓ ఫోన్ వచ్చింది. ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైనట్లు అందులోని సమాచారం. కొన్ని నెలల కిందట పరిచయమైన వ్యక్తి చేతిలో తాను మోసపోయానని ఆ మహిళ వాపోయింది.
జనవరి 1న లోధి రోడ్డు సమీపంలో నిందితుడిని మొదటి సారి కలిశానని మహిళ పోలీసులకు తెలిపింది. ఓ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఢిల్లీలో ఒక ఫ్లాట్‌ను వెతకడానికి తనకు సహాయం చేయమని సునీల్ ఆ మహిళను కోరాడు. వారు ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ సాగిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆ మహిళను సునీల్ హోటల్ కు రమ్మని ఆహ్వానించాడు. అయితే అతడిని నమ్మి వెళ్లిన ఆమె తనను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు మందు కలిపిన డ్రింక్ ను తనకు తాగించాడని, ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Next Story