Mon Dec 23 2024 04:08:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఆరుగురి మృతి
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. అలాగే నంద్యాల జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మృతులంతా ఆడవారే కావడం విషాదం. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. అలాగే నంద్యాల జిల్లాలో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం మందడిలో వేగంగా వచ్చిన లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్లలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంతాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story