Sat Jan 04 2025 10:21:05 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో భారీ పేలుడు : ఆరుగురు మృతి
పేలుడు అనంతరం భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్ కు..
అహ్మదాబాద్ : గుజరాత్ లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి, ఆరుగురు మృతి చెందారు. బారుచ్ జిల్లాలో తెల్లవారుజామున 3 గంటలకు ఓమ్ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు ఘటన జరిగింది.
ఫ్యాక్టరీలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు .. విచారణకు ఆదేశించారు. ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story