Mon Dec 23 2024 12:36:34 GMT+0000 (Coordinated Universal Time)
గొంతునులిమి, గోడకేసి కొట్టి, యాసిడ్ పోసి.. చిన్నారిపై దాష్టీకం
ఇంటిముందు మ్యాగీ తింటున్న చిన్నారిని టీనేజర్లు ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక కనిపించకపోవడంతో..
ఆడిపిల్లలు, మహిళలు, యువతుల భద్రతకై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతోమందిని కఠినంగా శిక్షించినా.. వారిపై ఏదొక మూల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులు కొందరైతే.. సమాజంలో జరిగే దారుణాలు చూస్తూ.. ఆడపిల్లను కనేందుకు మరికొందరు భయపడుతున్నారు. అడుగడుగునా కంటికిరెప్పలా చూసుకోవాల్సిన సోదరులు, తండ్రులు, బాబాయ్ లు, ఆఖరికి తాతయ్యలు కూడా చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఘటనలెన్నో.
తాజాగా ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా చంపేశారు ఇద్దరు టీనేజర్లు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగింది. ఇంటిముందు మ్యాగీ తింటున్న చిన్నారిని టీనేజర్లు ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బుధవారం గ్రామంలోని రెండిళ్ల మధ్య మృతదేహాన్ని గుర్తించారు. చివరిసారిగా ఆ బాలికను ఇద్దరు టీనేజర్లతో చూసినట్లు కొందరు చెప్పడంతో.. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించడంతో.. గొంతునులిమి, గోడకేసి కొట్టి చంపేసినట్లు నేరం అంగీకరించారు.
చిన్నారి హత్యానంతరం.. మృతదేహాన్ని నిందితుల్లోని ఒకరి ఇంట్లో ఉన్న పూజగదిలో దాచిపెట్టారు. ఆ తర్వాత చిన్నారిని గుర్తుపట్టకుండా ఉండేదుకు ఆమె ముఖంపై యాసిడ్ పోసి, అర్థరాత్రి వేళ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి వీధిలో పడేశారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి, నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Next Story