Mon Dec 23 2024 12:13:01 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ బాలిక అత్యాచారం కేసులో 64 మంది అరెస్ట్ !
గుంటూరుతో పాటు విజయవాడ, కాకినాడ, తణుకు, నెల్లూరు, హైదరాబాద్ ల్లోని వ్యభిచార గృహాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది.
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో.. 64 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. తల్లి కరోనాతో మరణించగా.. ఆ బాలికను మాయమాటలతో ఓ మహిళ తన వెంట తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో 64 మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలో గత ఏడాది జూన్ లో తల్లికూతుళ్ళకు కరోనా సోకింది. దీంతో భర్త తన భార్య, కూతురిని జీజీహెచ్ లో చేర్పించాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. ఆ సమయంలో స్వర్ణకుమారి అనే మహిళ ఆ బాలికతో పరిచయం ఏర్పరుచుకుంది. మెల్లగా బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది.
గుంటూరుతో పాటు విజయవాడ, కాకినాడ, తణుకు, నెల్లూరు, హైదరాబాద్ ల్లోని వ్యభిచార గృహాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది. ఆరునెలల పాటు బాలిక చిత్రవధ అనుభవించి, ఆరోగ్యం క్షీణించడంతో స్వర్ణకుమారి చెర నుంచి తప్పించుకుంది. నేరుగా తండ్రి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించారు. కేసును సీరియస్ గా తీసుకున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వర్ణకుమారి తో పాటు 23 మందిని అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తాజాగా మరికొందరిని అదుపులోకి తీసుకుని.. వారిపై కూడా పోక్సో చట్టంతో పాటు.. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఒక మైనర్ బాలిక అత్యాచారం కేసులో 64 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Next Story