Sun Dec 22 2024 11:04:31 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్నారు.. హెచ్.ఐ.వీ. సోకి బాధపడుతున్నారు
రోడ్‌సైడ్ టాటూ ఆర్టిస్టుల నుంచి టాటూలు వేయించుకున్న
రోడ్డు పక్కన టాటూలు వేయించుకుంటున్నారా? అది జీవితాలను నాశనం చేయగలదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 68 మంది మహిళలకు హెచ్ఐవి పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. జిల్లా మహిళా ఆసుపత్రిలో ప్రినేటల్ చెకప్‌లు, కౌన్సెలింగ్‌లో ఈ మహిళలు హెచ్ఐవి పాజిటివ్ అని తేలారు. 68 మంది మహిళల్లో 20 మంది తమ శరీరంలో టాటూలు వేయించుకోవడం వల్ల వ్యాధి సోకిందని అనుమానిస్తున్నారు.
రోడ్‌సైడ్ టాటూ ఆర్టిస్టుల నుంచి టాటూలు వేయించుకున్న వారు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాటూ వేయించుకున్న వెంటనే, వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వారిలో HIV లక్షణాలు కనిపించాయి. టాటూ ఆర్టిస్ట్ హెచ్.ఐ.వీ. సోకిన సూదిని చాలామందికి ఉపయోగించాడని మహిళలు ఆరోపించారు.హెచ్.ఐ.వీ. సోకిన మహిళలందరికీ సురక్షితమైన ప్రసవ సంరక్షణ అందించారు.
ఆసుపత్రిలోని హెచ్ఐవి కౌన్సెలర్ ఉమా సింగ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 15-20 మంది మహిళలు హెచ్ఐవి పాజిటివ్ అని తేలుతోంది. నాలుగు సంవత్సరాలలో వ్యాధి సోకిన 68 మంది మహిళల్లో, 20 మంది రోడ్డు పక్కన వేయించుకున్న టాటూల వల్ల HIV బారిన పడ్డారని కౌన్సెలింగ్ పోస్ట్-టెస్టింగ్ వెల్లడించింది. ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ అల్కా శర్మ మాట్లాడుతూ, “హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్, హెపటైటిస్ వ్యాధులు రక్తమార్పిడి ద్వారా వ్యాపిస్తాయి. కలుషితమైన రక్తం, hiv సోకిన సూదులను ఇతరులకు వాడడం ద్వారా కూడా HIV వ్యాపిస్తుంది. సంక్రమణను నివారించడానికి, జాగ్రత్త, అప్రమత్తత అవసరం." అని తెలిపారు.
Next Story