Sun Dec 22 2024 20:40:34 GMT+0000 (Coordinated Universal Time)
తరగతిగదిలో ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
వచ్చిన పిల్లలంతా స్కూల్ మూసి ఉందని తిరిగి ఇళ్లకు వెళ్లగా.. మరికొందరు కొద్దిసేపు ఆడుకోవచ్చని అక్కడే ఉండిపోయారు.
ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ ఉండట్లేదు. ఇంట-బయట ఎక్కడికక్కడే కామాంధులు కాచుకుని కూర్చుంటున్నారు. తాజాగా ఆరోతరగతి బాలికపై తరగతిగదిలోనే సామూహిక అత్యాచారం జరిగిన ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది. మాల్దా జిల్లాలోని బాధిత బాలిక స్నేహితురాలు ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. గత శనివారం (మార్చి 18) న పాఠశాలను మూసివేశారు. ఆ విషయం తెలియక కొందరు పిల్లలు స్కూల్ కి వెళ్లారు.
వచ్చిన పిల్లలంతా స్కూల్ మూసి ఉందని తిరిగి ఇళ్లకు వెళ్లగా.. మరికొందరు కొద్దిసేపు ఆడుకోవచ్చని అక్కడే ఉండిపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ మొదటి అంతస్తులో ఉన్న క్లాస్ రూమ్ లో ఆడుకుంటున్నారు. అదే సమయంలో పాఠశాలలోకి ముగ్గురు యువకులు వచ్చారు. ఇద్దరు బాలికల్లో ఒక బాలిక వెళ్లిపోగా.. అక్కడే ఉన్న మరో బాలికపై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత బాలిక స్నేహితురాలు.. బాలిక తల్లికి చెప్పగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
Next Story