Mon Dec 23 2024 10:54:25 GMT+0000 (Coordinated Universal Time)
తనను చూసి నవ్వారని ఏడుగురిని చంపిన వ్యక్తి
ఎడ్గార్ రికార్డో డి ఒలివియేరా అనే వ్యక్తి పూల్ గేమ్ ఆడేందుకు వెళ్లాడు. బ్రెజిల్ కరెన్సీలో 4 వేల రియాల్స్..
పూల్ గేమ్ లో ఓడిపోయిన తనను చూసి నవ్వారని ఓ వ్యక్తి ఏడుగురిని కాల్చి చంపాడు. ఈ ఘోరమైన ఘటన బ్రెజిల్ లోని మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరంలో జరిగింది. ఎడ్గార్ రికార్డో డి ఒలివియేరా అనే వ్యక్తి పూల్ గేమ్ ఆడేందుకు వెళ్లాడు. బ్రెజిల్ కరెన్సీలో 4 వేల రియాల్స్ పందెం కాసి ఓ గేమ్ లో ఓడిపోయాడు. అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోసారి తన స్నేహితుడితో కలిసి వచ్చి.. తాను ఓడిపోయిన వ్యక్తితోనే మళ్లీ పందెం కాశాడు.
రెండాసారి కూడా ఒలివియేరా ఓటమి పాలయ్యాడు. దాంతో అతడిని చూసి అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. రెండుసార్లు ఓటమిపాలయ్యానన్న ఉక్రోషంతో ఉన్న ఒలివియేరా.. వారి నవ్వును చూసి భరించలేకపోయాడు. తన స్నేహితుడితో కలిసి వారిని తుపాకీతో బెదిరించి వరుసగా నిలబెట్టాడు. ఆపై, ఒక్కొక్కరిని కాల్చి చంపాడు. ఒలివియేరా కాల్పుల్లో మృతి చెందిన వారిలో పూల్ గేమ్ క్లబ్ యజమాని, 12 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బ్రెజిల్ పోలీసులు నిందితుడు ఒలివియేరా, అతనికి సహకరించిన స్నేహితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
- Tags
- brazil
- crime news
Next Story