Thu Jan 02 2025 20:05:03 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి
శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో..
రోడ్డుప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందిన విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. బీదర్ లో జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. మరో 11 మంది గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. గాయపడిన వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూలీలుగా గుర్తించారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story