Mon Dec 23 2024 09:11:07 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం
సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిన అయిన గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి బర్కత్ పురలోని గోకుల్ ధామ్ అపార్ట్ మెంట్స్ లో
పదమూడేళ్ల మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలో జరిగింది. ఈ దారుణం మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిన అయిన గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి బర్కత్ పురలోని గోకుల్ ధామ్ అపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్నాడు. బాధితురాలి తల్లి 2010 నుంచి 2017 సంవత్సరం వరకూ అతని ఇంట్లో పనిచేసి.. ఆ తర్వాత మానేసింది. జీవనోపాధి కోసం టైలరింగ్ చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటోంది.
Also Read : భారీ వర్షం.. నీట మునిగిన వరంగల్ కాలనీలు
కానీ వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది తల్లి.. తన కుమార్తెను ఇంట్లోనే వదిలి సొంత ఊరికి వెళ్లింది. ఎప్పటిలాగానే సంచులు కావాలన్న నెపంతో ఇంటికి వచ్చిన వీరారెడ్డి ఇంట్లో ఎవరూ లేరని గమనించాడు. ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి.. బాలిక అసలు విషయం చెప్పడంతో ఆమె మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు, స్కూటర్, సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story