Mon Dec 23 2024 03:20:59 GMT+0000 (Coordinated Universal Time)
కారులో ఊపిరాడక చిన్నారి మృతి
కిరాణా షాపుకని వెళ్లిన అఖిల ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. ఊరంతా గాలించారు కుటుంబ సభ్యులు.
కాకినాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి కారులో ఊపిరాడక మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే పాలప్యాకెట్ కోసమని కిరాణా షాపుకి వెళ్తున్న అఖిలాండేశ్వరి(8)కి ఇంటి పక్కన వారి కారు కనిపించింది. ఓసారి కారు ఎక్కాలనిపించి ఎక్కి.. డోర్ వేసేసింది.
దాంతో కారు డోర్ లాక్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ అవ్వలేదు. కిరాణా షాపుకని వెళ్లిన అఖిల ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. ఊరంతా గాలించారు కుటుంబ సభ్యులు. ఎవరిని అడిగినా కనిపించలేదు, తెలియదు అని చెప్పడంతో కిడ్నాప్ కు గురైందేమోనని భావించారు. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటివారి కారు తెరిచి చూశారు. ఆ కారులో అఖిలాండేశ్వరి విగతజీవిగా కనిపించింది. వెంటనే యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story