Mon Dec 23 2024 09:55:06 GMT+0000 (Coordinated Universal Time)
బాలుడిని చంపి తగులబెట్టారు.. ఆ తర్వాత వర్షం పడడంతో
నిప్పంటించిన కొంతసేపటికి వర్షం కురియడంతో
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామ సమీపంలో ఓ బాలుడిని దుండగులు హతమార్చారు. చంపేసిన తర్వాత నిప్పంటించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలుడిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి హత్య చేసి కాలువ సమీపంలో నిప్పంటించి వెళ్లారు.
నిప్పంటించిన కొంతసేపటికి వర్షం కురియడంతో మంటలు చల్లారడంతో బాలుని మృతదేహం సగం కాలిపోయింది. శనివారం వ్యవసాయ పొలాల్లో పనుల కోసం వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి గ్రామంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ సీఐ యాదాద్రి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహకారంతో వివరాలు సేకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు వనపర్తి తదితర పోలీస్ స్టేషన్లకు కొల్లాపూర్ పోలీసులు సమాచారం అందజేసి బాలుడి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలుడికి సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story