Fri Nov 22 2024 23:43:10 GMT+0000 (Coordinated Universal Time)
చదువుకోమని తండ్రి మందలించాడని.. 9 ఏళ్ల బాలిక బలవన్మరణం
ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఇలాంటి దారుణాలు ఎక్కువయ్యాయి. చదువుకన్నా.. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే..
ఈ కాలంలో పిల్లలు, యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలిస్తే అది మన మంచికే కదా అని క్షణమైనా ఆలోచించకుండా.. తిట్టారన్న కోపంతో తమను తామే కోల్పోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఇలాంటి దారుణాలు ఎక్కువయ్యాయి. చదువుకన్నా.. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే గడుపుతుండటంతో అది వారి భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా ఓ తండ్రి తన 9 ఏళ్ల కూతుర్ని చదువుకోవాలని మందలించాడు. అంతే క్షణమైనా ఆలోచించకుండా ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మార్చి 27 సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో నివసించే కృష్ణమూర్తికి 9 ఏళ్ల వయసున్న ఓ కూతురు ఉంది. ఇన్స్టాగ్రామ్లో నిత్యం యాక్టివ్గా ఉండే బాలికను చుట్టుపక్కల వారు ఇన్స్టా క్వీన్ అని పిలుస్తుంటారు. సోమవారం ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఎప్పుడు చూసినా ఆటలు లేకపోతే ఫోన్ తో సమయం గడుపుతుండటంతో.. ఆటలు ఆపి వెళ్లి చదువుకోవాలని బాలికకు సూచించి.. ఇంటి తాళాలు ఇచ్చి తమ ఇంటికి పంపించారు. ఆ తర్వాత తండ్రి తన బైక్ తీసుకుని పెట్రోల్ కోసం ఇంటికి వెళ్లారు. రాత్రి 8.15 గంటలకు ఇంటికి వెళ్లిన ఆయన..తలుపులు కొట్టగా బాలిక ఎంతకీ స్పందించలేదు. దీంతో కంగారు పడిపోయిన కృష్ణమూర్తి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లగా.. బాలిక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story