Mon Dec 23 2024 19:27:32 GMT+0000 (Coordinated Universal Time)
ఛైల్డ్ పోర్న్ వీడియోల కేసులో తిరుపతి వ్యక్తి అరెస్ట్
ఆన్ లైన్ లో చిన్న పిల్లల పోర్న్ వీడియోల విక్రయం కేసు తిరుపతిలో నమోదయింది. ఒక వ్యక్తిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు
ఆన్ లైన్ లో చిన్న పిల్లల పోర్న్ వీడియోల విక్రయం కేసు తిరుపతిలో నమోదయింది. తిరుపతికి చెందిన మోహన్ కృష్ణను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని యశోదనగర్ కు చెందిన మోహన్ కృష్ణను ఈ ముఠాలో సభ్యుడిగా గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద మోహన్ కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మోహన్ కృష్ణను పోలీసులు విచారిస్తున్నారు.
ఆన్ లైన్ లో....
ఆన్ లైన్ లో పిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా చైల్డ్ పోర్న్ వీడియోలు ఎక్కువగా ఆన్ లైన్ లో సర్క్యులేషన్ అవుతున్నాయి. పిల్లల వీడియోలను సర్క్యులేషన్ చేసి, చూసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ఆన్ లైన్ లో కేటుగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. చిన్న పిల్లల పైన ఆన్ లైన్ లో లైంగిక వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో పోర్న్ వీడియోలు పిల్లలపై వేధింపుల సంబంధించి సిబిఐ రంగంలోకి దిగింది .
దేశ వ్యాప్తంగా దాడులు...
ఈ మేరకు దేశవ్యాప్తంగా 23 కేసులను నమోదు చేసింది. 80 మంది అనుమానితులు ఈ వీడియోలని సర్కులేషన్ చేస్తున్నట్లుగా సీబీఐ గుర్తించింది. ఈ మేరకు 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు మొదలు పెట్టింది. ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బీహార్ మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ల లో సిబిఐ సోదాలు నిర్వహించింది.
Next Story