Thu Dec 19 2024 15:58:01 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లికి ఎసరు పెట్టిన ఫేస్ బుక్ న్యూడ్ కాల్స్..
కొన్నాళ్లక్రితం యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో పెళ్లి నిశ్చయమైంది. కాబోయే భర్త కావడంతో..
ఫేస్ బుక్ ఫ్రెండ్ తో ఉన్న చనువుతో.. ఓ యువతి న్యూడ్ కాల్ మాట్లాడింది. అది రికార్డు చేసిన సదరు వ్యక్తి.. ఆమెను పెళ్లాడబోయే వ్యక్తితో పాటు.. పలువురికి ఆ వీడియోను షేర్ చేశాడు. యువతి పెళ్లి చెడగొట్టాలన్న ఉద్దేశంతో చేసిన ఈ పని.. సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. అటు యువకుడు, ఇటు పెళ్లి రద్దు చేసుకుని పెళ్లికొడుకుతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఓ యువతికి ఫేస్ బుక్ ద్వారా కర్రా న్యూటన్ బాబు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో అతని కోరిక మేరకు ఆమె న్యూడ్ కాల్ చేసింది.
కొన్నాళ్లక్రితం యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో పెళ్లి నిశ్చయమైంది. కాబోయే భర్త కావడంతో అతనికి పెళ్లికి ముందే శారీరకంగా దగ్గరైంది. జూన్ 14వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా.. న్యూటన్ బాబు సదరు యువతితో మాట్లాడిన న్యూడ్ కాల్ రికార్డును పరంజ్యోతికి పంపాడు. ఆ కాల్ ను పెళ్లి కుదిర్చిన పెద్దలకు చూపించి పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు పరంజ్యోతి. పెళ్లికొడుకుతో పాటు బంధువులైన మరో ముగ్గురికి ఆ కాల్ ను పంపాడు న్యూటన్ బాబు. దాంతో బాధిత యువతి గుడివాడ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని బెదిరించి న్యూడ్ కాల్ రికార్డ్ చేసిన న్యూటన్ బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు, మరో ముగ్గురు జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్ లపై 109,120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. మెజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించింది. సోషల్ మీడియాల్లో వచ్చే న్యూడ్ కాల్స్ ను డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ తులసీధర్ హెచ్చరించారు.
Next Story