Mon Dec 23 2024 08:39:37 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్గడ్ లో ఘోరప్రమాదం: ఏడుగురి మృతి
ఛత్తీస్గడ్ లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు
ఛత్తీస్గడ్ లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సున్నపురాయి మైన్ కూలిన ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. అనేక మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సున్నపురాయి కింద మరో పదిహేను మంది వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సున్నపురాయిని తవ్వుతుండగా...
చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. బస్తర్ లోని మల్గావ్ ప్రాంతంలో సున్నపురాయి కోసం కొందరు తవ్వుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సహాయ బృందాలు రక్షణ చర్యలో పాల్గొంటున్నాయి. ఐదుగురు సున్నపురాయి కూలిన వెంటనే చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story