Mon Dec 23 2024 08:22:33 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు
కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారే. బీదర్ జల్లాలోని బంగూర్ వద్ద హైవే పై కంటెనర్ ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒక చిన్నారి కూడా మృతి చెందింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కారులో గానుగాపూర్ కు దత్తాత్రేయ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గానుగాపూర్ వెళుతుండగా....
సీసీఎస్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిధర్ తన కుటుంబంతో దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి కలబురిగి జల్లా గానుగాపూర్ బయలుదేరారు. కారులో పది మంది వరకూ ఉన్నారు. గానుగాపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గిరిధర్ తో పాటు, అనిత, ప్రియ, మహేష్, జగదీష్ లు మృతి చెందారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Next Story