Mon Dec 23 2024 08:48:43 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. వీరందరూ కరీనంగర్ లోని జ్యోతినగర్ వాసులుగా గుర్తించారు.
నిద్రమత్తులో....
వీరంతా ఖమ్మం జిల్లా కల్లూరుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన కొప్పుల శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. బాలాజీ శ్రీధర్ న్యాయవాది వృత్తిలో ఉన్నారు. డ్రైవర్ జలంధర్ కూడా మరణించారు.
Next Story