Mon Dec 23 2024 07:16:58 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
ఏలూరు జిల్లా పూళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. . ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
ఏలూరు జిల్లా పూళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడి పరిస్థిితి కూడా విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదుపుతప్పి రావడంతో...
వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఆగి ఉన్న బైకులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ఆర్టీసీ డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో యాక్సిడెంట్ అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story